RC 16 Update Peddhi title is not confirmed yet: రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయగా తన తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పటికీ ఆ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయలేదు కాబట్టి రామ్ చరణ్ 16వ సినిమా అని సంబోధిస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ప్రచారం జరుగుతోంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా అని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. కానీ తాజా సమాచారం మేరకు అదైతే నిజంగా ఫిక్స్ కాలేదని అంటున్నారు.
IIFA Awards : ఈసారి ఆ ఇద్దరు స్టార్ హీరోల సందడి
ఆ టైటిల్ పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే కానీ ఇంకా అదే ఫిక్స్ చేయాలని ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్యనే ఏఆర్ రెహమాన్ బుచ్చి బాబుతో కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే మూడు సాంగ్స్ ఫైనల్ చేశారట. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఆ మూడు పాటలు బుచ్చిబాబుతో సహా టీం కి బాగా నచ్చాయని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ఏమిటంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుంచి సెట్స్ మీదకు సినిమాని తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి రామ్ చరణ్ తన 16వ సినిమా కోసం లుక్స్ రెడీ చేసుకుంటున్నాడు. కొంతకాలం పాటు లో ప్రొఫైల్ మైంటైన్ చేసి లుక్ ఫైనల్ అయిన తర్వాత అధికారికంగా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.