మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతానికి భాను భోగవరపు డైరెక్షన్లో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. గత ఏడాది రవితేజ చేసిన ఈగల్ సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఏమాత్రం వర్కౌట్ కాకపోవడంతో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని ఎంతో ఎదురుచూసి మరీ భాను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా తర్వాత ఆయన కిషోర్ తిరుమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజం కాదని తెలుస్తోంది.
Tollywood: సూపర్ హిట్ డైరెక్టర్ కి హీరో కావలెను!!
రవితేజ కిషోర్ తిరుమల కథ విన్న మాట వాస్తవమే కానీ ఇంకా పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆయనకు మాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఒక కథ చెప్పాడని, అది ఆయనకు నచ్చింది అని తెలుస్తోంది. ప్రస్తుతానికి కళ్యాణ్ శంకర్ మాడ్ సీక్వల్ మాడ్ స్క్వేర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్ బేస్ చేసుకుని రవితేజ కళ్యాణ్ శంకర్ తో సినిమా ఓకే చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే కిషోర్ తిరుమల తో సినిమా అనేది కేవలం గాసిప్ మాత్రమేనని అంటున్నారు. కిషోర్ తిరుమల సినిమాకు ఇంకా పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.