NTV Telugu Site icon

Raviteja: ఈసారి హోం పిచ్‌లో మ్యాచ్.. ఈసారి తగ్గేదే లేదేస్!

Ravi Teja

Ravi Teja

వాల్తేరు వీరయ్య అంటూ చిరంజీవితో కాకుండా సింగిల్ గా రవితేజ హిట్ కొట్టి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చివరిగా ధమాకా అనే సినిమాతో రవితేజ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ఏ ఒక్క సినిమా ఆయనకు అచ్చి రాలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ అంటూ ఆయనకు వరుస దెబ్బలు తగిలాయి. ప్రస్తుతానికి ఆయన భాను భాగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే కిషోర్ తిరుమల ఒకపక్క క్లాసి లవ్ స్టోరీస్ తో పాటు మాసీ సినిమా కూడా చేయగలరని నిరూపించుకున్నాడు.

Chhaava: రిలీజ్ కు ముందు వివాదం.. అయినా భారీ క్రేజ్

కాబట్టి ఆయన క్లాస్ సినిమా చేస్తాడా మాస్ సినిమా చేస్తాడా? అనే అంశం మీద చర్చలు జరుగుతూ ఉండగా ఎవరూ ఊహించని విధంగా రవితేజ హోం జోనర్ అయిన కామెడీ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం పూర్తి స్థాయిలో రవితేజ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రాజెక్టు ఫైనల్ అయింది. కొత్తగా ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పూర్తిచేసి షూట్ కూడా పూర్తి చేసి వచ్చేయేడాది సంక్రాంతి సందర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద రవితేజకు హోమ్ పిచ్ లాంటి కామెడీ జానర్ సినిమా చేస్తే ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి చూడాలి. మరి ఏం జరగబోతోంది అనేది.