మాస్ మహారాజా రవితేజ “క్రాక్”తో చాలా కాలం తరువాత హిట్ ను అందుకుని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. “రాజా ది గ్రేట్” తరువాత ఆయనకు వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. కానీ కరోనా ఉన్నప్పటికీ ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ధైర్యంగా థియేటర్లలోకి వచ్చాడు. ఈ చిత్రం హిట్ రవితేజకు మంచి ఎనర్జి ఇచ్చిందనే చెప్పాలి. గతంలో “రాజా ది గ్రేట్”కు ముందు కూడా రవితేజ వరుస డిజాస్టర్లతో సతమతమయ్యారు. ప్రస్తుతం ఆయన యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”లో నటిస్తున్నారు. రవితేజకు ఇది 67వ చిత్రం. ‘రాక్షసుడు’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 12న ‘ఖిలాడీ’ టీజర్ విడుదల కాగా… దానికి మంచి స్పందన వచ్చింది. స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జయంతిలాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Read Also : “కూ”లోకి అడుగు పెట్టిన అనుష్క
తాజాగా రవితేజ పారితోషికం భారీగా పెంచాడనే విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన పారితోషికంగా నిర్మాతలను రూ.17 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ… కొంతమంది ఆయన అంత రెమ్యూనరేషన్ కోరడం రీజనబుల్ అంటుంటే, మరికొందరు మాత్రం ఇది చాలా ఎక్కువ అని ఫీల్ అవుతున్నారట.
