మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఒకేసారి మూడు భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో పాటు ‘ధమాకా’ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇందులో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు రెండూ షూటింగ్ పూర్తయ్యే దశలో ఉండగా, ఆయన ఇటీవల ప్రకటించిన ‘ధమాకా’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే సినిమా షూటింగ్ ను ప్రారంభించిన ‘ధమాకా’ టీం తాజాగా హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘ధమాకా’లో రవితేజ ‘పెళ్లి సందడి’ ఫేమ్ బ్యూటీ శ్రీ లీలతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీనికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు.
Read Also : పారితోషికం పెంచేసిన కీర్తి సురేష్
రవితేజ స్పీడ్ చూసి యంగ్ హీరోలు సైతం షాక్ అయ్యేలా ఉంది పరిస్థితి. ఇంత ఫాస్ట్ గా వరుస ప్రాజెక్టులను ఒప్పుకోవడమే కాకుండా షూటింగ్ ను కూడా అంతే తొందరగా పూర్తి చేస్తున్నాడు. నిజానికి ఇతర హీరోలెవరూ కూడా రవితేజ అంత జోష్ తో సినిమాల చిత్రీకరణను పూర్తి చేయడం లేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా క్రేజ్ పై కన్నేశారు. మరి రవితేజ ఎప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కనిపిస్తాడా? అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
