మాస్ మహారాజా రవితేజ మళ్లీ ఫాంటసీ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాతో సంచలనాన్ని సృష్టిస్తున్న యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ వశిష్ఠ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రవితేజను లాక్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం వశిష్ఠ చెప్పిన మరో సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ రవితేజకు బాగా నచ్చిందట. స్క్రిప్ట్ స్టేజ్‌లోనే రవితేజ “ఇది నా స్టైల్‌లోనే ఉంది” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రానుందనే బజ్ ఉంది.
Also Read : Kajal Aggarwal : వేకేషన్ మూడ్‌లో కాజల్ అగర్వాల్..భర్తతో రొమాంటిక్ మోమెంట్స్
ఇక ప్రాజెక్ట్ అధికారిక అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుందని ఫిల్మ్ సర్కిల్స్ టాక్. ప్రస్తుతం వశిష్ఠ “విశ్వంభర” ఫైనల్ షెడ్యూల్‌లో బిజీగా ఉండగా, ఆ సినిమా రిలీజ్ తర్వాత రవితేజ మూవీపై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడట. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై హైప్ క్రియేట్ చేస్తున్నారు “మాస్ మహారాజా × విజువల్ మాస్టర్ కాంబో అంటే లెవెల్ వేరే ఉంటుంది!” అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ కొత్త కాంబినేషన్ టాలీవుడ్‌కి ఓ కొత్త అనుభూతిని అందిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. మరి రవితేజ – వశిష్ఠ జంటగా ఈ భారీ ఫాంటసీ ప్రాజెక్ట్ ఎప్పుడు అధికారికంగా రానుందో చూడాలి!
