Site icon NTV Telugu

GlobeTrotter : ‘వారణాసి’ ఈవెంట్ ఎఫెక్ట్.. ఎస్ఎస్ రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు

Rajamouli

Rajamouli

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ రిలీజ్ GlobeTrotter ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. SSMB29 టైటిల్ ను వారణాసి గా ప్రకటిస్తూ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసాడు రాజమౌళి.  అయితే ఓ చిన్న సాంకేతిక లోపం కారణంగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ దాదాపు అరగంట పాటు నిలిచిపోవడంతో రాజమౌళి కాస్త అసహనానికి గురయ్యాడు. ఆ సమయంలో రాజమౌళి మాట్లాడుతూ ‘ నాకు దేవుడి మీద నమ్మకం లేదండి, నా తండ్రి విజయేంద్రప్రసాద్ నాతో మాట్లాడూతూ టెన్షన్ పడకు అంత హనుమ చూసుకుంటాడు, వెనకుండి నడిపిస్తాడు అన్నారు. కానీ సాంకేతిక లోపం కారణంగా ఆగినప్పుడు ఇలానే నడిపించేది అని కోపం వచ్చింది. నా భార్య రమా హనుమాన్ అంటే చాలా చాలా ఇష్టం. ఒక ఫ్రెండ్ లాగా ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇలా ఎందుకు అయిందని కోపం వచ్చింది’ అని అన్నారు. రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : DUDE : ఓటీటీలో అదరగొడుతున్న డ్యూడ్..

అయితే హనుమంతుడిపై ఎస్ఎస్ రాజమౌళి పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు. రాజమౌళిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు.

Exit mobile version