నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో బలమైన పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘మైసా’ (Maisa). ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం కానున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోండగా. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకుంది. భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ ఆదివారం పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. దీనికి మూవీ టీం హాజరు కాగా . సురేష్ బాబు క్లాప్ కొట్టారు. రవి కిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేసిన హను రాఘవపూడి ముహూర్తపు షాట్‌కు గౌరవ దర్శకత్వం చేశారు.
Also Read : Dhanush : ఇడ్లీ కొట్టు నుండి మొదటి సింగిల్ రిలీజ్..
కాగా ఈ సినిమా కథ గోండు తెగల నేపథ్యంలో సాగనుండగా, ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందట. రష్మిక ఈ సినిమాలో ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రలో కనిపించనుందట. ఆమె క్యారెక్టర్‌కి డెప్త్ ఉంటుందని, శక్తివంతమైన భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చిన కథతో చిత్రబృందం ముందుకు రానుందని సమాచారం. మొత్తానికి రష్మిక మంచి కథలను ఎంచుకుంటూ తన గ్రాఫ్‌ను మరింత పెంచుకుంటోంది. మరి ఈ ‘మైసా’ తో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
