Site icon NTV Telugu

Rashmika-Vijay : ‘కింగ్‌డమ్’ పై రష్మిక ఎమోషనల్ ట్వీట్..

Rashmika $ Vijay

Rashmika $ Vijay

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ విడుదలై, అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. అభిమానులూ, ఇండస్ట్రీ వాళ్లు సోషల్ మీడియాలో హర్షధ్వానాలు చేస్తున్న వేళ, ఓ ఎమోషనల్ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read : Network : ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసిన.. సస్పెన్స్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ ‘నెట్‌వర్క్’

తాజాగా నేషనల్ క్రాష్ రష్మిక మందన్న ‘నీకూ, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది ఎంత ముఖ్యమో నాకు తెలుసు విజయ్.. “మనమే కొట్టినాం” కింగ్‌డమ్. అని ట్వీట్ చేసింది. ఈ మాటల వెనుక ఉన్న భావం సూటిగా హృదయాలను తాకుతుంది. విజయ్ దేవరకొండ ఎంతగా కష్టపడ్డాడో, ఈ సినిమా మీద ఆయనకు ఎంత నమ్మకంతో ఉన్నారో – అన్ని ఈ ట్వీట్ లో స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా “మనమే కొట్టినాం” అన్న మాటలో గర్వం, భావోద్వేగం రెండూ సమపాళ్లలో ఉన్నాయి. ప్రజంట్ ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక కింగ్‌డమ్ చిత్రం ప్రస్తుతానికి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. విజయ్ కొత్తగా ఎంచుకున్న కథ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, టెక్నికల్ టీమ్ చూసినవాళ్లంతా సినిమా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. ఈ తరహా మద్దతు, ప్రేమ విజయ్ దేవరకొండకు మరో స్థాయిలో నిలిచేలా చేస్తోంది.

 

Exit mobile version