Site icon NTV Telugu

The Girl Friend: నిన్న ఎంగేజ్మెంట్.. నేడు రిలీజ్ డేట్

The Girlfriend

The Girlfriend

బ్యాక్‌ టు బ్యాక్‌ భారీ సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read:Little Hearts : దుమ్ము లేపిన లిటిల్ హార్ట్స్.. మరో రికార్డు

తాజాగా చిత్ర యూనిట్ ఒక కీలక అప్డేట్‌ను అందించింది. ఈ సినిమాను నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో రష్మిక అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇదే సమయంలో రష్మిక – విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ వార్తలు బయటకు వచ్చి హాట్ టాపిక్‌గా మారగా, వెంటనే రష్మిక కొత్త సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ కావడం ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రొమాంటిక్ టచ్‌తో పాటు ఎమోషనల్ కనెక్ట్ కూడా బలంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రష్మిక కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందో లేదో చూడాలి.

Exit mobile version