Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?

Rashmika Vs Kalyani

Rashmika Vs Kalyani

Rashmika Mandanna Eye on Kalyani Priyadarshan Record: సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన మూవీ ‘లోక: చాప్టర్ 1’. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. దక్షిణాదిన అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు పలువురు స్టార్ హీరోయిన్లు ప్రయత్నిస్తున్నా.. ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ‘మైసా’తో ఆ రికార్డుపై కన్నేసింది.

ఈ ఏడాది ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాలని సమంత, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు ప్రయత్నించారు. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. మహిళా ప్రధాన పాత్రలో వచ్చిన అత్యధిక వసూళ్ల తెలుగు చిత్రంగా నిలిచింది. రూ.100 కోట్ల మార్క్ అందుకున్నా.. లోక సాధించిన రూ.300 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడానికి ఇంకా చాలా దూరం నిలిచింది.

మరోవైపు నయనతార నటించిన ‘మూకుత్తి అమ్మన్ 2’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల పరంగా పూర్తిగా నిరాశ పరిచింది. ఇప్పుడు రికార్డుల వేటలో కీర్తి సురేశ్, రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. కీర్తి నటించిన ‘సత్యవాన్ సావిత్రి’ నవంబర్ 20న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడం లేదు. అందుకే లోక రికార్డును అందుకోవడం కష్టమే. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన మైసాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆమె ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతార్‌లో అలరించనుంది. గోండు గిరిజన యువతి పాత్రలో కనిపించబోతున్న రష్మిక.. ఈ చిత్రం కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడింది. పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ సాహసం చేసింది.

రష్మిక నటించిన ‘కాక్‌టెయిల్ 2’ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. మరోవైపు భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘రణబాలి’ మంచి వసూళ్లు సాధించింది. నవంబర్ 27న మైసా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు హీరోల సినిమాలతో భారీ వసూళ్లు సాధించిన రష్మిక.. ఒక మహిళా ప్రధాన చిత్రంతో రూ.300 కోట్ల మార్కును దాటి కల్యాణి ప్రియదర్శన్ లోక రికార్డును బద్దలు కొడుతుందా? అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.