NTV Telugu Site icon

మళ్లీ మళ్లీ అదే అంటే నా వల్ల కాదు: రష్మిక

లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు.. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా, సిద్ధార్త్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిషన్ మంజు’ అనే సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇదిలావుంటే, కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్​గా పరిచయమైన రష్మిక.. ఈ సినిమా హిందీ రీమేక్​ కోసం ఆమెను సంప్రదించగా, చేయనని చెప్పిందట. అందుకు గల కారణాన్ని రీసెంట్ గా వెల్లడించింది. ‘నా ఉద్దేశంలో.. ఏదైనా పాత్ర చేసేటప్పుడు మొదటిసారి మాత్రమే ఎమోషన్స్​గా బాగా చేయగలం. మళ్లీ మళ్ళీ అదే పాత్ర చేయడం నా వల్ల కాదు. నేనేప్పుడు కొత్త పాత్రల్ని, కథల్ని ప్రేక్షకులకు చెప్పేందుకు ఇష్టపడతాను. అందుకే ‘కిరిక్ పార్టీ’ రీమేక్​లో నటించలేనని తెలిపాను’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.