Site icon NTV Telugu

ఓటిటి కోసం రాశిఖన్నా క్రేజీ రోల్ ?

Rashi Khanna Turns Detective for Web Series

స్టార్ హీరోయిన్లంతా ఓటిటి బాట పడుతున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా, కాజల్ తన డిజిటల్ ఎంట్రీతో ఎంటర్టైన్ చేశారు. తాజాగా బబ్లీ బ్యూటీ రాశిఖన్నా కూడా అదే దారిలో నడవబోతున్నారు. ఆమె ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఓ వెబ్ సిరీస్ లో పవర్ రోల్ పోషించబోతోందట. కథంతా సీరియల్ హత్యల చుట్టూ తిరుగుతూ పలు ట్విస్ట్ లను కలిగి ఉంటుంది. ఇందులో రాశి ఖన్నా క్రేజీగా డిటెక్ట్టివ్ రోల్ పోషించబోతున్నారట. ఈ సిరీస్ “పాతాళ లోక్” మాదిరిగానే ఉంటుంది. కాకపోతే దాని కథా నేపథ్యం వేరు. ఇది వేరు అని తెలుస్తోంది.

Read Also : ట్రైలర్ : టైం లూప్ లో చిక్కుకుని “కుడి ఎడమైతే” !

సమాచారం ప్రకారం ఈ సిరీస్‌లో 8 ఎపిసోడ్‌లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ కోసం నూతన డైరెక్టర్ సూర్య వంగల మెగాఫోన్‌ పట్టుకోబోతున్నాడు. సోనీ లైవ్ ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనుంది. సోనీ ఇటీవలే తెలుగు వైపు దృష్టి సారించింది. దక్షిణాది నుండి ఎక్కువ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలని భావిస్తోంది. ఈ సిరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మరి ఈ వెబ్ సిరీస్ తో రాశి ఖన్నా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుందో చూడాలి.

Exit mobile version