Site icon NTV Telugu

దూకుడు చూపిస్తున్న రాశి ఖన్నా.. ధనుశ్ జోడీగా ఛాన్స్!

బ్యూటీ రాశిఖన్నా గ్లామర్ డోస్ పెంచేశాక ఒక్కసారిగా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఇటు టాలీవుడ్ లోను, అటూ కోలీవుడ్ లోను సినిమాల జోరు చూపిస్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థ్యాంక్యూ’ చేస్తున్న రాశి ఖన్నా, గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’లోను నటిస్తోంది. కోలీవుడ్ లోను ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’ సినిమాల షూటింగ్స్‌ ను పూర్తి చేసిన ఈ బ్యూటీ, తాజాగా కార్తీ ‘సర్దార్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. ధనుష్‌ హీరోగా మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి హీరోయిన్‌గా రాశీఖన్నా ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈమేరకు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఇక హిందీ సినిమాల్లోను సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూ, వెబ్ సిరీస్ లలో దూకుడు చూపుతోంది. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ ‘సన్నీ’, అజయ్‌ దేవగణ్‌ ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌ల షూటింగ్‌లతో రాశి ఖన్నా బిజీగా వుంది.

Exit mobile version