గతేడాది ‘ది సబర్మతీ రిపోర్ట్’, ‘యోధ’ లాంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న నటి రాశీ ఖన్నా, వరుసగా ప్రత్యేకమైన పాత్రలతో ముందుకు సాగుతోంది. ఇటీవల పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో అవకాశం దక్కించుకుని మరింత క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా..తాజాగా రాశీ మరో హిస్టారికల్, ప్యాట్రియాటిక్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
Also Read : Su From So : తెలుగులోకి వచేస్తున్న మరో కన్నడ హిట్ మూవీ..
బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘120 బహాదుర్’ అనే చిత్రంలో రాశీ కీలక పాత్రలో కనిపించనుందట. ఈ చిత్రానికి దర్శకుడిగా రజనీశ్ ఘాయ్ పని చేస్తున్నారు. ఈ సినిమా 1962లో భారత్-చైనా మధ్య జరిగిన యుద్ధంలో ఓ కీలక ఘట్టమైన ‘రెజాంగ్ లా’ యుద్ధం ఆధారంగా రూపొందుతోంది. ఈ యుద్ధంలో అత్యంత వీరంగా పోరాడిన మేజర్ షైతాన్ సింగ్ జీవితాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. దేశభక్తిని పోషించే యథార్థ గాథను తెరకెక్కించాలన్న లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోందట. రాశీ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల గాథలో రాశీ ఖన్నా పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
