సౌత్ దర్శకులంటే నార్త్ స్టార్లకు చిన్న చూపా. వీళ్లు చెప్పినప్పుడు షూట్ చేయడానికి, ఆడిందే ఆడగా, పాడిందే పాటగా హిందీ డైరెక్టర్ల తలాడించినట్లు సదరన్ డైరెక్టర్లు చేయడం లేదా. అందుకే బీటౌన్ హీరోస్ సౌత్ డైరెక్టర్లకు మధ్య సరైన బాండింగ్ బిల్డ్ కావడం లేదా. అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యుయేషన్. మొన్న సికిందర్ ప్లాప్ వెనుక సల్మానే రీజన్ అని కుండబద్దలు కొట్టాడు మురుగుదాస్. అలాగే అమీర్ ఖాన్- లోకేష్ కనగరాజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి పట్టాలెక్కాల్సిన ప్రాజెక్ట్ ట్రాక్ తప్పింది. హీరోలే చేయాలా నేనేందుకూ చేయకూడదనుకుందేమో దీపికా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్లతో పేచీలు పెట్టుకొని వెళ్లిపోయింది.
Also Read : OG : పవర్ స్టార్ ‘OG’ కథ.. ఇన్ సైడ్ టాక్ ఇదే.. ఆ సినిమాని పోలి ఉన్నట్టుందిగా?
కొంచెం త్వరగానే తన అభిప్రాయాన్ని చెప్పి దర్శకుల టైం సేవ్ చేసింది దీపికా పదుకొనే. కానీ రణవీర్‌సింగ్ అలా కాదు కొంత కాలం పాటు ఆ డైరెక్టర్‌తో ట్రావెల్ చేసి చివరికి హ్యాండ్ ఇచ్చేశాడు. హనుమాన్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించాడు ఈ గల్లీబాయ్. రాక్షస అనే పేరుతో సినిమా ప్లాన్ చేసాడు డైరెక్టర్. ఇక సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి అనుకున్న టైంలో ప్రాజెక్ట్ ఆగిపోయింది. కారణం ఏంటా అని చూసే హీరోకు,దర్శకుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ అని తెలిసింది. ఇలా 3, 4 మంత్స్ ప్రశాంత్ వర్మ టైంని రణవీర్ వేస్ట్ చేస్తే, మాలీవుడ్ హీరో కం డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌ని 2 ఇయర్స్ వెయిట్ చేయించాడట. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యపే రివీల్ చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు అనురాగ్ కశ్యప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం.. ‘నేను మాలీవుడ్‌లో ఓ అవార్డ్ పంక్షన్‌కు వెళ్లినప్పుడు వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కలిశాడు. ఇంత తక్కువ టైంలో ఇన్ని వైవిధ్యమైన పాత్రలు ఎలా సాధ్యమయ్యాయని ప్రశ్నించినప్పుడు బాలీవుడ్‌లో తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని నాతో పంచుకున్నాడు. శక్తిమాన్ కోసం రెండేళ్లు టైం వేస్ట్ చేసుకున్నానని నాతో చెప్పాడు. బీటౌన్‌లో ఎలా సర్వైవ్ అవుతున్నారని బాసిల్ నన్ను క్వశ్చన్ చేస్తే నేను అక్కడ జీవించలేకే వచ్చేసా” అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. దీనిని బట్టి చూస్తే రణవీర్ శక్తిమాన్‌ను బాసిల్ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నాడని అప్పట్లో వచ్చిన వార్తలు నిజమే. కానీ క్రియేటివ్ డిఫరెన్స్‌తో బయటకొచ్చాడు ఈ మాలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో. మొత్తానికి సౌత్ దర్శకులకు హ్యాండిస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు అన్నమాట.