రాజ్ కపూర్ తనయుడు, ఒకప్పటి బాలీవుడ్ రణధీర్ కపూర్, కరిష్మా, కరీనా కపూర్ తండ్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకుంటున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న రణధీర్ కపూర్ డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 29న రణధీర్ కపూర్ తో పాటు ఆయన సిబ్బంది ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. రణధీర్ కపూర్‌ను ప్రారంభంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కు తరలించారు. అనేక పరీక్షల తరువాత అతన్ని ఐసియు నుంచి మామూలు వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఇక తాజాగా డిశ్చార్జ్ అయిన రణధీర్ కపూర్ ను కొన్ని రోజులు కుటుంబ సభ్యులు కలవకూడదు అని చెప్పారట వైద్యులు. రణధీర్ తనను బాగా చూసుకున్న ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
రణధీర్ కపూర్ ప్రముఖ చిత్రనిర్మాత రాజ్ కపూర్ పెద్ద కుమారుడు. అతను తన తమ్ముళ్ళయినా రిషి కపూర్,రాజీవ్ కపూర్లను ఒక సంవత్సరం వ్యవధిలో కోల్పోయాడు. రిషి కపూర్ గతేడాది ఏప్రిల్ 30న క్యాన్సర్‌తో మరణించారు. ఇక రాజీవ్ కపూర్ గుండెపోటుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు.