Site icon NTV Telugu

రాధే : విలన్ ను పరిచయం చేసిన టీం…!

Randeep Hooda look in new poster of Salman Khan's Radhe

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. ప్రభుదేవా దర్శకత్వం వహించగా… సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విలన్ గా రణదీప్ హుడా లుక్ ను విడుదల చేశారు మేకర్స్. విలన్ లుక్ లో రణదీప్ మొత్తం నల్ల దుస్తులలో, పొడవాటి జుట్టు, సన్ గ్లాసెస్ ధరించి పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈద్ సందర్భంగా ‘రాధే’ ఇండియాలో థియేట్రికల్ విడుదలతో సహా 40 కి పైగా దేశాలలో విడుదల కానుంది. ఈ సినిమాను మే 13న థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ బేసిస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. జీ ప్లెక్స్ సంస్థ మూవీని చూడాలంటే రూ. 249 పే చేయాలని ప్రకటించింది. ఓ బాలీవుడ్ సినిమా ఒకే రోజున ఇలా థియేటర్లలోనూ, ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి.

Exit mobile version