NTV Telugu Site icon

Allu: తాతా – మనువడి అల్లరి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Untitled Design 2024 08 12t140649.964

Untitled Design 2024 08 12t140649.964

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్. అయాన్‌కు సంబంధించి పలు వీడియోలు అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. అయాన్ అల్లరి ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ మధ్య బన్ని, అయాన్ వీడియో ఒకటి హల్ చల్ చేసింది. అలవైకుంఠపురం టైమ్ లో స్కూల్ డుమ్మా కొట్టి షూటింగ్ కి వెళ్లి ఇది మా తాత సినిమా అని అయాన్ చెప్పిన డైలాగులు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.

Also Read: Surya: కంగువ ట్రైలర్ వచ్చేసింది.. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే..?

తాజాగా అయాన్ వీడీయో మరోటి రిలీజ్ అయింది. ఈసారి తాత అల్లు అరవింద్ తో కలిసి క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అయాన్. అటు అల్లు అరవింద్‌ కూడా మనవడితో క్రికెట్‌ ఆడుతూ చిన్నపిల్లాడిగా ఖుషి అవుతున్నాడు అల్లు అరవింద్. ఈ వయసులో కూడా మనవడికి బౌలింగ్‌ వేస్తూ పరుగులు పెడుతూ ఫీల్డింగ్‌ చేస్తూ కనిపించారు అల్లు అరవింద్. తాత బౌలింగ్‌ వేస్తుంటే అల్లు అయాన్‌ పెద్ద పెద్ద షాట్లు ఆడుతూ తాతని పరుగులు పెట్టించాడు. ఈ సరదా సన్నివేశాన్ని తన మొబైల్ లో వీడియో తీసింది అల్లు అయాన్ తల్లి అల్లు స్నేహ. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది స్నేహ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పనిలో పనిగా మీరు ఓసారి తాత, మనవడి గల్లీ క్రికెట్ ను చూసేయండి

Show comments