Site icon NTV Telugu

Rana : కొత్తపల్లి‌లో ఒకప్పుడు.. రానా కొత్త ప్రయోగం వర్కౌట్ అయ్యేనా.. !

Kothapallilo Okapudu

Kothapallilo Okapudu

ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు చేస్తున్న రానా దగ్గుబాటి మరో కొత్త తరహా చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా పేరే ఆసక్తికరంగా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అని పెట్టారు.  గ్రామీణ నేపథ్యం తో సాగే ఈ భావోద్వేగ కథ వెనక సున్నితమైన సామాజిక సందేశం కూడా ఉంది. ఈ చిత్రానికి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిన్న సినిమాలతో పెద్ద సెన్సిబుల్ హిట్స్ అందించిన ప్రవీణ, ఈసారి మరింత లోతైన కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read : Megha Start: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో చిరు సందడి.. పిక్స్ వైరల్ !

ఈ కథలో గ్రామీణ యువకుడు తన జీవితంలో ఎదురైన ఓ అనూహ్య సంఘటన, తరువాత ఎదుర్కొన్న ప్రయాణాన్ని చూపించ నుంది. మారుతున్న సమాజంలో గ్రామీణ సంస్కృతి, విలువలు, సంబంధాలు ఎలా మాయమవుతున్నాయనే విషయాన్ని ఈ చిత్రం లోతుగా చూపనుంది. కాగా ఈ మూవీలో రానా, పూర్తి గ్రామీణ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు చూడని ఓ మెలోడ్రామా టిక్, ఎమోషనల్ కోణంలో రానా నటనను ఈ సినిమాలో చూడబోతున్నాం. మేకర్స్ చెబుతున్న దానివల్ల ఇది రానా కెరీర్‌లో కొత్త మలుపు కావొచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు లాస్ ఏంజిల్స్‌కి చెందిన అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ విజువల్స్ అందిస్తుండగా, ఈ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే టైటిల్ పాయింట్, కాన్సెప్ట్ విషయంలో మంచి బజ్ క్రియేట్ అవ్వగా. ఇప్పుడు చూడాల్సిందల్లా ఈ కొత్త ప్రయోగం రానా‌కు హిట్‌ అందిస్తుందా లేదా అన్నది.

Exit mobile version