Site icon NTV Telugu

ఉదారత చాటమంటున్న రానా!

Rana Daggubati urge all to come together in solidarity and help

కరోనాను ఎదుర్కొవడంలో కేవలం వైద్య సిబ్బందే కాదు… ఇతరులూ తమ వంతు సాయం చేస్తున్నారు. సోనూ సూద్ మొదలు కొని ఎంతో మంది సెలబ్రిటీస్ తమ పరిథిలో ఆపన్న హస్తం అందించే పనిలో ఉన్నారు. సురేశ్ ప్రొడక్షన్ వంటి నిర్మాణ సంస్థలు ఎప్పటికప్పుడు కరోనా బాధితుల అవసరాలు తెలుసుకుని, సోషల్ మీడియా ద్వారా వారికి సహాయం చేసే వారికి ఆ విషయాన్ని చేరవేసే పని చేస్తున్నాయి. ఇదే సమయంలో నటుడు రానా మరో అడుగు ముందుకేసి కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునే పనిలో పడ్డాడు. రోజూ వారి పనిచేసుకుని జీవితం గడిపే వారిని ఆదుకోవడమే ప్రధానంగా ఫ్రమ్ యు టు దెమ్, ఓఆర్ కైండ్ నెస్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు బాధితులకు ఆక్సిజన్, ఆహారం, వైద్య సదుపాయాలను అందిస్తోంది. ఆ సంస్థకు తోచిన రీతిలో ఆర్థిక సాయం చేయమంటూ రానా సోషల్ మీడియా వేదికగా అభిమానులను కోరుతున్నాడు.

Exit mobile version