టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటికి సంబంధించిన న్యూ లుక్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత వచ్చిన రానా లేటెస్ట్ పిక్ పై ఆయన అభిమానులు భారీగా లైకులు కురిపిస్తున్నారు. కొంతకాలం క్రితం ఆరోగ్య సమస్యల కారణంగా బరువు తగ్గిన రానా లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు మళ్ళీ తన మునుపటి రూపంలోకి రానా మారిపోతున్నాడు. కఠినమైన ఆహారం, వ్యాయామాలతో మళ్ళీ కొత్త మేకోవర్ లోకి చేంజ్ అయ్యాడు రానా. తాజాగా ఓ ఈ-కామర్స్ ఫ్యాషన్ ఫెస్టివల్‌ను ప్రోత్సహిస్తూ ఈ చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Read Also : కార్తీక్ ఆర్యన్ కొత్త మూవీ టైటిల్ చేంజ్… కారణం ఇదేనట…!
ఇక రానా కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే మిహికాను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో తెలుగుతో పాటు హిందీలో కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రానా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న “విరాట పర్వం”లో కనిపించనున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన “అయ్యప్పనమ్ కోషియం” రీమేక్ చిత్రీకరణను ఆయన త్వరలో తిరిగి ప్రారంభిస్తారు. అంతేకాకుండా హిందీలో “హాథీ మేరీ సాథీ” అనే చిత్రంలో నటిస్తున్నాడు.
