మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. అనేక వాయిదాల తర్వాత జనవరి 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది గేమ్ ఛేంజర్. భారీ అంచనాలు మధ్య గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రం.
Also Read : Devara : ఏపీ – తెలంగాణ 17 వ రోజు కలెక్షన్స్.. NTR ఊచకోత..
ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాడ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. కాగా రామ్ చరణ్ తన తదుపరి రెండు సినిమాలను లాక్ చేసాడు. బుచ్చి బాబు సినెమా ముగిసిన వెంటనే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను RRR ను నిర్మించిన DVV దానయ్య నిర్మించబోతున్నాడు. ఈ సినిమా కంప్లిట్ చేసాక తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇటీవల లోకేష్ రామ్ చరణ్ కలిసి స్టోరీ వినిపించాడని, ఆ లైన్ నచ్చడంతో రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. లోకేష్ రజనీతో చేస్తున్న కూలీ ఫినిష్ చేసి ఖైదీ -2, లియో సిక్వెల్ ను ఫినిష్ చేసి రామ్ చరణ్ సినిమాను తెరకెక్కిస్తాడని టాక్. అటు ప్రశాంత్ నీల్ కూడా తారక్ తో చేస్తున్న సినిమా అయ్యాక సలార్ -2 చేసాక రామ్ చరణ్ సినిమా తెరకెక్కిస్తాడు. బుచ్చి బాబు సినిమా కోసం లుక్ చేంజ్ చేసే పనిలో ఉన్నాడు మెగా పవర్ స్టార్