మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చివరి షెడ్యూల్ లో రామ్ చరణ్ కు సంభందించి కొంత మేర షూటింగ్ పెండింగ్ ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే క్లారిటి లేదు. మరోవైపు ఈ చిత్ర డబ్బింగ్ పనులను కూడా మెుదలు పెట్టారు మేకర్స్. వీలైనంత త్వరగా ఈ సినిమాను ముగించాలని భావిస్తున్నాడు మెగా పవర్ స్టార్.
కాగా తన తదుపరి సినిమాను చాలా రోజుల క్రితం ప్రకటించాడు చరణ్. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చి బాబు సన దర్శకత్వంలో నటించబోతున్నాడు చరణ్. అత్యంత భారీ బడ్జెట్ లో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మెుదలెట్టాలని ప్లాన్ చేస్తున్నారట యూనిట్. ఈ లోపు రామ్ చరణ్ తన ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా అందుకోసం బాడీకొంత పెంచి ఫిట్ గా మారేందుకు డైట్ ప్లాన్ మార్చబోతున్నాడట మెగా హీరో. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయకగా నటిస్తుండగా ఆస్కార్ విజేత A.R రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా రామ్ చరణ్ ప్రజెంటే సినిమా గేమ్ ఛేంజర్ డిసెంబరు 20న క్రిస్టమస్ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.