Site icon NTV Telugu

ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర!

Music Director and Singer Ramana Gogula Birth Day Special

విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు రమణ గోగుల మెల్‌బోర్న్. మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా (Top Notch Entertainment Australia) సంయుక్తంగా “ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ – రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026” పేరిట ఒక భారీ సంగీత యాత్రను ప్రకటించాయి. మీడియా సమావేశంలో రమణ గోగులతో పాటు, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ కట్టాల, మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ ఈ వరల్డ్ టూర్ వివరాలను వెల్లడించారు.

రమణ గోగుల తన సంగీత ప్రస్థానంలో తొలిసారిగా పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సర్ట్ టూర్ (Global Concert Journey) చేపడుతుండటం తెలుగు సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని వారు అభిప్రాయ పడ్డారు. ఈ టూర్ కేవలం సంగీత కచేరీలకు మాత్రమే పరిమితం కాదు. రమణ గోగుల ఐకానిక్ పాటలు, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలు, తెర వెనక ఉన్న కథలతో కూడిన ఒక భావోద్వేగభరితమైన అన్వేషణ అని వారు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఒక వినూత్నమైన ‘డాక్యు-మ్యూజికల్ సిరీస్’ను రూపొందిస్తోంది. 2026 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనతో ఈ ప్రపంచ యాత్ర ప్రారంభమవుతుంది. తదుపరి దశల్లో యూకే, అమెరికా పర్యటనలు ఉంటాయి. ఆస్ట్రేలియా (ఫిబ్రవరి 2026): మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్. యూకే (2026): లండన్, మాంచెస్టర్ (ప్రణాళికలో ఉంది). అమెరికా (2026): ఈస్ట్ కోస్ట్ & వెస్ట్ కోస్ట్ (ప్రణాళికలో ఉంది).

Exit mobile version