ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు రమణ గోగుల మెల్‌బోర్న్. మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా (Top Notch Entertainment Australia) సంయుక్తంగా “ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ – రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026” పేరిట ఒక భారీ సంగీత యాత్రను ప్రకటించాయి. మీడియా సమావేశంలో రమణ గోగులతో పాటు, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ కట్టాల, మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ ఈ వరల్డ్ టూర్ వివరాలను వెల్లడించారు.
రమణ గోగుల తన సంగీత ప్రస్థానంలో తొలిసారిగా పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సర్ట్ టూర్ (Global Concert Journey) చేపడుతుండటం తెలుగు సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని వారు అభిప్రాయ పడ్డారు. ఈ టూర్ కేవలం సంగీత కచేరీలకు మాత్రమే పరిమితం కాదు. రమణ గోగుల ఐకానిక్ పాటలు, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలు, తెర వెనక ఉన్న కథలతో కూడిన ఒక భావోద్వేగభరితమైన అన్వేషణ అని వారు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఒక వినూత్నమైన ‘డాక్యు-మ్యూజికల్ సిరీస్’ను రూపొందిస్తోంది. 2026 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనతో ఈ ప్రపంచ యాత్ర ప్రారంభమవుతుంది. తదుపరి దశల్లో యూకే, అమెరికా పర్యటనలు ఉంటాయి. ఆస్ట్రేలియా (ఫిబ్రవరి 2026): మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్. యూకే (2026): లండన్, మాంచెస్టర్ (ప్రణాళికలో ఉంది). అమెరికా (2026): ఈస్ట్ కోస్ట్ & వెస్ట్ కోస్ట్ (ప్రణాళికలో ఉంది).
Also Read
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
తాజావార్తలు
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?