Site icon NTV Telugu

రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్

Ramachandrapuram Teaser, Prashanth Madugula, Aishwarya, Narendranath

ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘రామచంద్రాపురం’. ఆర్. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో నిహాన్ కార్తికేయన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.

Read Also : ముగ్గురు మొనగాళ్లు : “ఓ పిల్లా నీ వల్ల” వీడియో సాంగ్

ఈ సందర్భంగా దర్శకుడు నరేంద్రనాథ్‌ మాట్లాడుతూ, ”రామచంద్రాపురం గ్రామంలోని రియల్ లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరించాం. వాస్తవానికి దగ్గరగా సినిమా ఉంటుంది. ఇప్పటికే ఇందులోని రెండు పాటలను విడుదల చేయడం జరిగింది. వాటికి చక్కని స్పందన వచ్చింది. నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిహాన్ కార్తికేయన్ కు ధన్యవాదాలు” అని అన్నారు. ఈ యాక్షన్ డ్రామా అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని హీరో ప్రశాంత్ మాడుగుల వ్యక్తం చేశారు.

Exit mobile version