ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు రచించిన ‘రామబాణం’ పుస్తకాన్ని ఆలయ ఛైర్మన్ మోహన్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ‘పుస్తకం బాగుంది. ఈ రామబాణం ప్రజాదరణ పొందాలి. అలాగే కరోనా తొలగి ప్రజలందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అన్నారు. తన పుస్తకం ‘రామబాణం’కు మోహన్ బాబు ముందుమాట చక్కగా రాశారని, ఆయన చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించటం ఆనందంగా ఉందని అన్నారు పూజారి రాంబాబు.
మోహన్ బాబు ఆవిష్కరించిన ‘రామబాణం’
