మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ హిట్ విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. రామ్ చరణ్ వీడియో బైట్‌లో మాట్లాడుతూ, “‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఓ డ్రీమ్ టీం సృష్టి. చిరంజీవి, శ్రీదేవి, అశ్వనీదత్, రాఘవేంద్రరావు, ఇళయరాజా, విన్సెంట్, యండమూరి వంటి మహానుభావులు కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇలాంటి టీం, ఇలాంటి క్లాసిక్ మళ్లీ రాదు. మా తరానికి ఇదే డ్రీమ్ టీం. సినిమా చివరలో చూపించిన రింగ్ ఏమైంది? ఆ చేప ఎక్కడుంది? ఈ ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి. ఇది వినతి కాదు, మా డిమాండ్” అని పేర్కొన్నారు.
Rama Charan: ‘జగదేక వీరుడు’కి నాగ్ అశ్విన్ సీక్వెల్ చేయాలి.. రామ్ చరణ్ డిమాండ్

Ram Charan