టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే ఒక యూనిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ తనలోని టాలెంట్ బయట పెట్టాడు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో ఒక సాంగ్‌కు స్వయంగా రామ్ లిరిక్స్ అందించాడు. ఇక ఈ ‘నువ్వుంటే చాలే’ పాటలోని సాహిత్యం పోయెటిక్‌గా, మనసుకు హత్తుకునేలా వుంది. ప్రేమని నిర్వచించలేమని, కేవలం అనుభవించగలమని చెప్పేలా ఉన్న లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ రైనీ సీజన్లో ఇది పర్ఫెక్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్. రిలీజ్ చేసిన గంటల వ్యవధిలోని ఇది మ్యూజిక్ లవర్స్ కి బాగా నచ్చేసింది. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ లూప్ మోడ్‌ల్లో వింటున్నారు.
Also Read : Bigg Boss : గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ..
అలాగే సాంగ్‌లో రామ్, భాగ్య శ్రీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సాంగ్‌కు మరింత ఆకర్షణను తీసుకు వచ్చాయి. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికి మ్యూజిక్ లవర్స్ లూప్ ప్లే లిస్ట్ లోకి ఎంటర్ అయిపోయింది. దీంతో విడుదల అయిన గంటల్లోనే కోటి వ్యూస్ సాధించడంతోపాటు భారీగా లైక్స్ సాధించి ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. పాటకి ఎక్కడ చూసినా హ్యూజ్ ట్రెమాండస్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ టైం లిరిక్ రైటర్‌గా మారిన రామ్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ బాగా వైరల్ అవుతోంది. రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టేశారు. నువ్వుంటే చాలే పాట గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అదిరిపోయింది అనే చెప్పాలి.
