టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని, మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘RAPO 22’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీదకు తీసుకెళ్లి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీలో రామ్ కి జోడిగా అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే రామ్ పోతినేని హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టి మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కసిగా ఉన్నాడు రామ్. ఇదిలా ఉంటే రామ్, భాగ్యశ్రీ గురించి ఓ న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
Also Read : Mohanlal : ‘తుడరుమ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..
ఈ హాండ్సమ్ హీరో ఇప్పుడు డేటింగ్‌లో ఉన్నట్లు.. అంతేకాక ఇద్దరూ సీక్రెట్‌గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లూ కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై కుండ బద్దలు కొట్టేసింది భాగ్యశ్రీ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఇన్ స్టా వేదికగా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ చాటింగ్‌లో ఓ నెటిజెన్ మీ చేతికి ఉన్న రింగ్ ఎవరు తొడిగారు? అని క్వశ్చన్ వేశారు.. దీంతో ఆమె ‘ఆ రింగ్ నాకు ఎవరు తోడగలేదు నేనే కొనుకున్నా’ అని తెలిపింది. అంటే దీని బట్టి ఈ రిలేషన్ రూమర్‌లో ఎలాంటి నిజం లేదని అర్ధం. కానీ ఇద్దరు ఒకే చోట ఉంటున్నట్లుగా కూడా ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ప్రజెంట్ ఇప్పుడు వీరిద్దరు ఒక మూవీలో భాగం అయ్యారు. అంటే సినిమాకు సంబంధించిన షూటింగ్ లో భాగంగా ఒక్క దగ్గర ఉండి ఉండవచ్చు అని టాక్.
