Site icon NTV Telugu

Bhagavad Gita : భగవద్గీత పై ఏఐ షార్ట్ ఫిల్మ్..

Bhagavad Gita Short Film

Bhagavad Gita Short Film

ప్రస్తుతం భారత సినిమా ఇండస్ట్రీ పురాణాలు, ఇతిహాసాల ఆధారిత సినిమాల‌పై మక్కువ చూపుతున్నారు. వందల ఏళ్ల నాటి గ్రంథాల కథలు, శ్లోకాల గాథలు నేటి టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘అదిపురుష్’, ‘శాకుంతలం’, ‘హనుమాన్’ లాంటి సినిమాలు రాగా.. తాజాగా బాలీవుడ్‌ నుండి  ‘రామాయణ’ కూడా రెండు బాగాలుగా రాబోతుంది. ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ పురాణాల ఆధారంగా ఏడు సినిమాలు నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించగా, ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్ప్రైజ్‌ను పంచుకున్నారు దర్శకుడు రామ్ మాధ్వాని .

Also Read : Rashmika: ‘యానిమల్’ లో రణబీర్ లాంటి వ్యక్తితో డేటింగ్ చేస్తా..

ఏఐని ఉపయోగించి భగవద్గీతపై  షార్ట్ఫిల్మ్ రూపొందించినట్లు చెప్పారు. రెండేళ్లు కష్టపడి దీన్ని అభివృద్ధి చేసినట్లు రామ్ మాధ్వానీ తెలిపారు. ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం ఐదు నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, అందులో గీతలోని 18 అధ్యాయాల సారాంశం చేయించినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రైవేట్ ప్రివ్యూలలో ఈ చిత్రాన్ని ప్రదర్శించాగా.. ‘వర్చువల్ రియాలిటీ ద్వారా మనం కథలోని పవిత్రతను పునరుద్ధరించవచ్చు. శతాబ్దాలుగా అందుబాటులో ఉన్న ఇతిహాసాల కంటే గొప్ప కథలు మరేం ఉండవు’ అని రామ్ మాధ్వానీ చెప్పారు. తన లక్ష్యం కేవలం పౌరాణిక కథను చూపడం మాత్రమే కాదని, ప్రేక్షకులను ఆధ్యాత్మిక అనుభూతికి దగ్గర చేయడం అని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు కేవలం కథగా మాత్రమే కాదు, మన సంస్కృతి, తత్వాన్ని ఆధునిక ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి.

Exit mobile version