NTV Telugu Site icon

RGV : షాకింగ్ డెసిషన్ తీసుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఇదంతా అయ్యేపనేనా..?

Rgv

Rgv

నూతన సంవత్సరం కానుకగా ప్రపంచమంతా సంబరాలు అంబరాన్నంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జీవితంలో సాధించబోయే వాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే కోవలో ఒకప్పటి సెన్సషన్ డైరెక్టర్. ఇప్పటి వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ కానుకగా షాకింగ్ డెసిషన్స్ తీసుకున్నాడు. అవి ఏంటో కూడా తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. మరి అవి ఏంటో ఓ సారి చదివేద్దాం రండి.

ఈ సంవత్సరం నేను తీసుకున్న 7 తీర్మానాలు అని మొదలు పెట్టి అందులో మొదటిది..
1 – నేను ఇక నుండి వివాదరహితుడిగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను
2 – నేను ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉండాలని భావిస్తున్నాను
3 – దేవుడి పట్ల భయం, భక్తి కలిగి ఉంటాను
4 – ఇక నుండి ప్రతి ఏడాది 10 సత్య లాంటి సినిమాలు తెస్తాను
5 – ఎవరిన నెగిటివ్ ట్వీట్స్ వేయను
6 – ఆడవారిని అసలు చూడను
7 – అలాగే వోడ్కా తాగడం మానేస్తాను

ఇవన్నీ తూచా తప్పకుండ పాటిస్తానని మీ అందరి మీద ఓటేస్తున్నాను. ఒక్కనా మీదా తప్ప అని తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలోతేగ వైరల్ అవుతోంది.

 

Show comments