ఈ మధ్యనే తాను మారిపోయానని ఇకమీదట అందరూ మాట్లాడుకునే లాంటి సినిమాలు చేస్తానంటూ రాంగోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను సిండికేట్ అనే సినిమా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సినిమాలో కీలక పాత్రలలో స్టార్ హీరోలు నటిస్తారని కూడా ఆయన హింట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ ని రామ్ గోపాల్ వర్మ సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మరింత మంది స్టార్స్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతితో పాటు అమితాబచ్చన్ వంటి వారిని కూడా సినిమాలో కీలకపాత్రలో తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
Ravi Teja : రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్ కి టైం ఫిక్స్..
వర్మకి అచ్చొచ్చిన మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కూడా ఉండబోతోంది. నిజానికి రామ్ గోపాల్ వర్మ వెంకటేష్ గతంలో క్షణక్షణం అనే సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకుని వీరిద్దరి కాంబినేషన్లో మాఫియా బాక్ డ్రాప్ సినిమా రాబోతూ ఉండటం గమనార్హం. ఇటీవల రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో వెంకటేష్ ఈ మాఫియా బ్యాక్ డ్రాప్స్ జానర్ ని కూడా టచ్ చేశారు. ఆ తర్వాత సైన్ధవ్ కూడా దాదాపు మాఫియా బ్యాక్ డ్రాప్ తోనే సినిమా మొత్తం సాగుతుంది. ఇప్పుడు ఆయన వర్మ సిండికేట్ లో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాంగోపాల్ వర్మ సినిమాలు సరిగ్గా చేస్తున్నా, చేయకపోయినా ఆయనకు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలానే ఉంది. దానిని చెక్కుచెదర్చుకోకుండా ఆయన మరోసారి ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.