PEDDI : ఏపీలో పెరిగిన ‘పెద్ది’ టికెట్ ధర.. స్పెషల్ జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ నటిస్తున్న పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. రిలీజ్ దగ్గరపడుతున్ననేపథ్యంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు మేకర్స్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతులు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేశారు.
దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి, సినిమా విడుదలకు ఒక రోజు ముందే అంటే జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక షోల కోసం టికెట్ ధరను రూ. 600 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక సినిమా రిలీజ్ రోజు అనగా జూన్ 4 నుండి జూన్ 10వ తేదీ వరకు (మొదటి వారం రోజుల పాటు) ప్రస్తుతమున్న టికెట్ ధరలపై అదనంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 100 చొప్పున, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు మేకర్స్‌కు ప్రత్యేక అనుమతి లభించింది. ఈ భారీ బడ్జెట్ కమర్షియల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాకు మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ‘పెద్ది’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ సాధించడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!