Peddi : బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం తాలూకూ ప్రమోషన్స్ స్పీడ్‌ను మేకర్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఈ మెగా వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 1వ తేదీన జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానుంది. దీనికి తోడు టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నటీనటులు, దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేక షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతులు మంజూరు చేయడంతో ‘పెద్ది’ బజ్ ఒక్కసారిగా రెట్టింపయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సాంగ్స్ ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా ఈ ఈవెంట్లో విడుదల చేయబోయే సెకండ్ ట్రైలర్ సినిమా రేంజ్‌ను డిసైడ్ చేయనుంది. లక్షలాది మంది అభిమానుల మధ్య జరగనున్న ఈ వేడుకకు విజయవాడ మునిసిపల్ స్టేడియం ముస్తాబవుతోంది.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?