NTV Telugu Site icon

Ram Charan: ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ స్పెషల్ ట్రైనింగ్?

Ram Charan Iffm 2024

Ram Charan Iffm 2024

Ram Charan’s Body Building training in Australia: రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి శంకర్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. తన 16వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం బాడీ బిల్డ్ చేసేందుకుగాను రామ్ చరణ్ తేజ ఆస్ట్రేలియాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ తేజ బాడీ బిల్డింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందే బాడీ ఫిట్గా ఉంచుకోవాలని భావించి ఆయన అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది ఈ సినిమా కోసం రాంచరణ్ అథ్లెటిక్లుక్ లో కనిపించాల్సి ఉంది. గత మూడు వారాల నుంచి ఆస్ట్రేలియాలోనే రామ్ చరణ్ తేజ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

Tollywood : టు డే టాప్ – 10 సినిమా న్యూస్..

ఈ నెలాఖరున ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులలో ఒక పెద్ద ఊరి సెట్ వేశారు. రాంచరణ్ ఇంటి తో పాటు అతని లొకాలిటీ అంతా అక్కడే షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న బుచ్చిబాబు రామ్ చరణ్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సినిమాస్ ఈ సినిమాని తరికెక్కిస్తుండగా 2026 లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Show comments