Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ రేపు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రేజీ మూవీ రిలీజ్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొనగా.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఒక అమేజింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు టాలీవుడ్లోనే హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
‘పెద్ది’ గెటప్‌లో భారీ విగ్రహం.. ‘శ్రీ కొణెదెల రామ్ చరణ్ దేవాలయం’!
రేపు ‘పెద్ది’ సినిమా రిలీజ్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కూకట్పల్లి వేదికగా అభిమానులు చేసిన ఒక పని తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. కూకట్‌పల్లిలోని ప్రముఖ అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ అభిమానులు ఏకంగా ఆయనకు గుడి కట్టేశారు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ పోషించిన పల్లెటూరి మాస్ రెజ్లర్ క్యారెక్టరైజేషన్‌ను పోలి ఉండేలా అభిమానులు థియేటర్ ప్రాంగణంలో ఒక భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతేకాదు ఆ విగ్రహం ఉన్న ప్రాంతానికి ‘శ్రీ కొణెదెల రామ్ చరణ్ దేవాలయం’ అని బోర్డు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లోబల్ స్టార్ క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్ళిందో చెప్పడానికి ఈ ఘటనే ఒక పర్ఫెక్ట్ నిదర్శనం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read
సినిమా రిలీజ్‌కు ముందే అర్జున్ థియేటర్ వద్ద వాతావరణం ఒక పెద్ద జాతరను తలపిస్తోంది. చరణ్ విగ్రహానికి అభిమానులు క్యూ కట్టి మరీ క్షీరాభిషేకాలు (పాలాభిషేకాలు) చేస్తున్నారు. కర్పూర హారతులు ఇస్తూ, కొబ్బరికాయలు కొడుతూ థియేటర్ దగ్గర పండగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రిలీజ్‌కు ముందే ఈ రేంజ్ హంగామా ఉందంటే.. రేపు థియేటర్లలో ‘పెద్ది’ బొమ్మ పడ్డాక మెగా ఫ్యాన్స్ సృష్టించే విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!