Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్‌లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!

Peddi Ramcharan

Peddi Ramcharan

Peddi Pre Review : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ రేపు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ‘పెద్ది’ ప్రి రివ్యూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లింది. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ ఒక కల్ట్ క్లాసిక్ కాబోతోందని చెప్తున్నారు. రేపు ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. తాజాగా అందుతున్న ఇన్‌సైడ్ టాక్ ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా రామ్ చరణ్‌తో నెక్స్ట్ లెవెల్ కంటెంట్‌ను ప్లాన్ చేశారని, థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే హై-వోల్టేజ్ సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్..
ఈ సినిమాలో ప్రతి పాత్రకూ పవర్‌ఫుల్ ఆర్క్స్, స్ట్రాంగ్ ఎమోషనల్ డెప్త్ ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా పెద్దిలో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని విధంగా ఒక సరికొత్త మేకోవర్, అద్భుతమైన నటనతో వన్-మ్యాన్ షో చేశారని తెలుస్తోంది. సినిమాలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ చరణ్‌లోని సరికొత్త నటన కోణాన్ని ఆవిష్కరిస్తాయని, ఆ సీన్స్ చూసి ప్రేక్షకులు ఎమోషనల్ అవ్వడం ఖాయమని ఇన్‌సైడర్స్ చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన నటిస్తున్న గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ లవ్ ట్రాక్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉండటమే కాకుండా, కథకు పెద్ద అసెట్‌గా నిలిచిందని టాక్. ఇప్పటికే తన లుక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విలక్షణ నటుడు జగపతి బాబు పాత్ర ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా, చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.

×
×
Ad

సెకండాఫ్‌లో రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విధ్వంసం..
ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలకు ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇవ్వబోతోందని అర్థమవుతోంది. నార్మల్‌గా ఒక సినిమాలో లాస్ట్ 10 – 20 నిమిషాలు ఎమోషన్స్ ఉంటేనే ఒక రకమైన అనుభూతిలోకి వెళ్తారు. అదే పెద్ది లాంటి పెద్ద సినిమాలో రామ్ చరణ్ లాంటి స్టార్ ని పెట్టుకొని సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ మీద నడపడం అనేది కత్తి మీద సాము లాంటిదని చెబుతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు సెకండ్ హాఫ్ పక్క ఎమోషనల్ రైడ్ అని అంటున్నారు. సుమారు చివరి 50 నిముషాలు ప్రేక్షకులను వారి సీట్లో నుంచి కదలకుండా చేస్తారని అంటున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ నిర్మాణ విలువలతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ‘పెద్ది’.. రేపు థియేటర్లలో ఎలాంటి సునామీ సృష్టించబోతుందో చూడాలి!