Site icon NTV Telugu

Peddi Pehelwan Glimpse: ‘పెద్ది’ గ్లింప్స్ విడుదల.. ‘ఆటే నా పొగరు’ డైలాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా, గూస్ బంప్స్ తెప్పిస్తున్న చరణ్‌ విన్యాసాలు!

Peddi Pehelwan Glimpse

Peddi Pehelwan Glimpse

Ram Charan Peddi Pehelwan Glimpse Out: గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం నుంచి ఆసక్తికరమైన గ్లింప్స్ విడుదలైంది. రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ స్పెషల్ ట్రీట్‌ను ఈరోజు అభిమానులకు అందించారు. విడుదలైన గ్లింప్స్‌లో చరణ్‌ పవర్‌ఫుల్ లుక్‌తో పాటు ఆయన డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా పెద్ది, రామ్‌ చరణ్‌ నామస్మరణతో ఊగిపోతోంది.

‘పెద్ది అంటే చావుకు ఎదురెళ్లే ఆట’ అనే డైలాగ్‌తో పెద్ది పహిల్వాన్‌ గ్లింప్స్ మొదలైంది. ఈ గ్లింప్స్‌లో ‘చూడమ్మే.. ఆటే నా పొగరు’ అని హీరో రామ్‌ చరణ్‌ చెప్పడం అభిమానుల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్‌ పాత్ర బలంగా, అగ్రెసివ్‌గా ఉండబోతుందని ఈ టీజర్‌ ద్వారా స్పష్టమవుతోంది. మల్లయోధుడిలా చరణ్ గెటప్ అదిరిపోయింది. కుస్తీ కోసం ఆయన తీసుకుంటున్న శిక్షణ, పోటీలో తలపడే తీరు వావ్ అనిపిస్తున్నాయి.

పెద్ది గ్లింప్స్‌లో రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. కండలు తిరిగిన దేహంతో ఆయన లుక్ వేరే లెవల్లో ఉంది. గదతో చరణ్ చేసిన విన్యాసాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పెద్ది సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన మొదటి టీజర్‌లో చరణ్ క్రికెట్ ప్లేయర్‌గా కనిపించగా.. ఇప్పుడు మల్ల యోధుడిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పెద్ది చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండనుందని సమాచారం. వీరిద్దరి కెమిస్ట్రీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా, గ్రామీణ బ్యాక్‌డ్రాప్.. అన్ని కలగలిపిన ఈ చిత్రం వచ్చే ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్లింప్స్ విడుదలతోనే ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Exit mobile version