Ram Charan: ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్.. ఏడున్నర కోట్ల కారుకు రిజిస్ట్రేషన్

  • హైదరాబాద్‌: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్ సందడి
  • రోల్స్‌ రాయ్స్ వాహన రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ ఆఫీస్‌కు రామ్‌చరణ్
  • రామ్ చరణ్ కారుకు టీజీ 09 సీ(చరణ్) 2727 అనే నెంబర్ జారీ
Ram Charan Car

Ram Charan Car

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్ సందడి చేశారు. తాను ఇటీవల కొనుగోలు చేసిన రోల్స్‌ రాయ్స్ కారు రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ ఆఫీస్‌కు రామ్‌చరణ్ వచ్చారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు స్టాఫ్, ఇతర వాహన రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చిన వారు ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఈ కారు ధర ఏకంగా ఏడున్నర కోట్లు. ఇక ఆన్ రోడ్ ధర ఇంకా ఎక్కువ. రోల్స్ రాయిస్ స్పెక్ట్రాగా పిలువబడే ఈ కారు ఇండియాలో రెండవ కారు అని తెలుస్తోంది. రామ్ చరణ్ కారుకు టీజీ 09 సీ(చరణ్) 2727 అనే నెంబర్ ఇచ్చారు అధికారులు.

Burugapally Siva Rama Krishna: టాలీవుడ్ నిర్మాత అరెస్ట్.. ఎందుకంటే?

ఆ మధ్య చరణ్, ఉపాసన ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ లో ఈ రోల్స్ రాయిస్ కారులో వెళ్లగా అక్కడ వీడియోలు వైరల్ గా మారాయి. రోల్స్ రాయిస్ కారు చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ రాగా ఉపాసన కూడా ఈ కారులో క్లీన్ కారాతో కలిసి వచ్చింది. నిజానికి రోల్స్ రాయిస్ కంపెనీ ఈ కారుని జనవరిలో రిలీజ్ చేయగా అప్పుడే చరణ్ బుక్ చేయించగా అది జూలై నెలలో మధ్యనే డెలివరీ అయింది. ఇది దేశంలో రెండవ కారు కాగా హైదరాబాద్ లో ఈ కార్ ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ కావడం గమనార్హం.