మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు కమల్ హాసన్ తో శంకర్ “ఇండియన్-2″ను తీయాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఈ చిత్రం ఆగిపోగా… అది పూర్తయ్యేవరకూ శంకర్ మరే ఇతర చిత్రాలను తీయకూడదని “ఇండియన్-2” నిర్మాతలు కోర్టుకెక్కారు. దీంతో శంకర్ ప్రకటించిన ఇతర ప్రాజెక్టులపై సందేహాలు నెలకొన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం… శంకర్, రామ్ చరణ్ మూవీ షూటింగ్ కు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించనున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందని అంటున్నారు.
Read Also : కొత్త ప్రాజెక్ట్ కు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ?
అయితే “ఆర్‌సి 15″ను మొదట్లో జూలై మొదటి వారం నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా చరణ్ నటిస్తున్న “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ షూటింగ్ తో పాటు “ఆర్‌సి 15” ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ఆగిపోయాయి. ఇక తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారం నుండి “ఆర్‌సి 15” సెట్స్ పైకి వెళ్లనుంది అంటున్నారు. రామ్ చరణ్ ఆగష్టు ఆరంభం నాటికి “ఆర్‌ఆర్‌ఆర్” షూటింగ్‌ను ముగించి, ఆపై స్క్రిప్ట్ రీడింగు, క్యారెక్టర్ వర్క్‌షాప్ కోసం నెల రోజులు విరామం తీసుకోనున్నాడు. మరోవైపు శంకర్ 6 నెలల వరకు నిరవధికంగా షూటింగ్ జరిపి, సినిమాను పూర్తి చేయాలనీ భావిస్తున్నాడు. ఆపై శంకర్ ఇప్పటికే ప్రకటించిన “అన్నియన్” హిందీ రీమేక్ పై దృష్టి సారించనున్నారు. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నాడు.
