2007లో చిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా అరంగేట్రం చేసి ఈ రోజుకి 18 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. మొదటి సినిమాలోనే తన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, మాస్ ఎనర్జీతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ లాంటి క్లాస్ అండ్ మాస్ మిశ్రమ చిత్రాలతో వరల్డ్ వైడ్ రెకగ్నిషన్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా యూనిట్ స్పెషల్ పోస్టర్ తో సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక ఈ పోస్ట్ ను షేర్ చేస్తూ చిరంజీవి స్పెషల్ మెసేజ్ షేర్ చేశారు.
Also Read :DVV Entertainment: ట్విట్టర్లో కౌంటర్.. డీవీవీ నిర్మాణ సంస్థపై కేసు
చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు…! అని పేర్కొన్నారు.
