Rakul Preet Singh Posted these Photos after her Brother Arrest: రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదులోని రాజేంద్రనగర్ పోలీసులు, తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదే విధంగా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్లో ఇద్దరు నైజీరియన్లు సహా ముగ్గురు ఇండియన్లు డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డారు. వారిలో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ తర్వాత కూడా పోలీసులు అతనికి సంబంధించిన వివరాలు బయట పెట్టేందుకు సంకోచిస్తున్నారు. ప్రస్తుతానికి పేరు ఒక్కటే తెలిసిందని రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అవునా కాదా అనే విషయాన్ని తాము ఇంకా నిర్ధారించలేదని చెబుతున్నారు.
Ariyana: రాజ్ తరుణ్ ప్రియురాలు ఆరోపణలు.. క్లీవేజ్ అందాలతో అరియనా బిగ్ ట్రీట్!
అమన్ ప్రీత్ సింగ్ తాను నటుడిని అని పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. సాధారణంగా పోలీస్ కేసు డైరీ రాసుకునేటప్పుడు పట్టుబడిన వారి వివరాలు నోట్ చేస్తారో ఆ నోట్ చేస్తున్న సమయంలో మీ వృత్తి ఏమిటి అని అడిగితే అతను నటుడిని అని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆ సంగతలా ఉంచితే ఒకపక్క రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్టయి పోలీసు కస్టడీలో ఉంటే ఇదేమీ పట్టనట్టుగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తన భర్త జాకీ భాగ్నానితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. వీరిద్దరూ కలిసి అంబానీ ఇంట వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఆ వివాహ వేడుకలకు ధరించిన డ్రెస్సులకు సంబంధించిన ఫోటోలను వారిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక పక్క తమ్ముడు అరెస్టు అయితే ఆ విషయం మీద ఎందుకు స్పందించడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రకుల్ ప్రీత్ సింగ్ ఈ అరెస్టు అంశం మీద ఎలా స్పందిస్తుంది అనేది.