టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో ఈ మధ్య సినిమాలు చేయలేదు.. సినిమా అవకాశాలు కూడా ఆమెను పలకరించలేదు.. దాంతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.. అక్కడ అనుకున్న అంత టాక్ లేకున్నా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..
ఇక తాజాగా తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ఆ ఫోటోలు కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్యే ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో నింపేస్తుంది. తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో పోజులి ఇచ్చారు. ఈ కొత్త జంట పార్లమెంట్ భవనంలో పెట్టిన పోజులిప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. సత్యమేవ జయతే అంటూ రకుల్ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి..
అంతేకాదు వీరిద్దరు కలిసి కొత్త పార్లమెంట్ ను చుట్టి వచ్చారు. కొత్త జంట కొత్త పార్లమెంట్ భవనం ముందు పెట్టిన పోజులు వైరల్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. రకుల్, జాకీలు బాలీవుడ్ సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టారు.. ఇక్కడే వరుస సినిమాలను చేస్తున్నారు..