Site icon NTV Telugu

Rakul Preet Singh : దేవుడి దయవల్ల నాకు దాని అవసరం రాలేదు..

Rakul Prithisingh

Rakul Prithisingh

ఒకప్పుడు టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపిన హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’ తో సినీరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు అందరు హీరోలతో జతకట్టిన ఆ ముద్దుగుమ్మ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రజంట్ తమిళంలో ‘ఇండియన్ 3’ సినిమాలో నటిస్తున్నది. అలాగే, బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్ దే-2’ సినిమాలో సీనియర్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌తో జతకడుతుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా రకుల్‌ ఇటీవల కాస్మెటిక్‌ సర్జరీపై తన అభిప్రాయం వెల్లడించింది.

Also Read: Passion : శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘పేషన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..

‘నేను ఎప్పుడూ కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే నాకు దేవుడు అందమైన ముఖాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను అలాంటి వాటి గురించి ఆలోచించలేదు’ అంటూ ఇటీవల రకుల్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను చూసిన వారంతా రకుల్‌ తన పెదవులకు ఏదో కాస్మెటిక్‌ సర్జరీ, ఫిల్లర్‌ చేయించుకున్నట్లు కామెంట్స్ చేశారు. కానీ రీసెంట్‌గా ఈ మాటలపై స్పందించి రకుల్.. ‘ఎవరైనా అలా చేయించుకోవాలనుకుంటే తప్పులేదు. గతంలో చాలా వ్యాధులకు చికిత్స లేదు. కానీ ప్రస్తుతం అని రకాల ట్రీక్‌మెంట్‌లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ఎవరైనా అందంగా కనిపించడానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే అందులో తప్పేముంది’ అంటూ తెలిపింది.

Exit mobile version