NTV Telugu Site icon

RakeshVarre : స్టార్ సెలెబ్రిటీస్ పై బాహుబలి నటుడి ‘కాంట్రవర్షియల్ కామెంట్స్’

Jitendar

Jitendar

రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇటీవలే జరిగింది. హీరో రాకేష్ మాట్లాడుతూ, “ఎవరికీ చెప్పొద్దూ సినిమా తర్వాత, చేస్తే మంచి సినిమా చేయాలి కానీ మాములు కంటెంట్ తో సినిమా చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. లేట్ అయినా కానీ మంచి సినిమా చేయాలనే నేను డిసైడ్ అయ్యాను. మార్కెట్ కానీ బ్రాండ్ కానీ లేకపోతే ఏ హీరో ని పట్టించుకోరు. నేను పేక మేడలు సినిమా తీసి చాలా తప్పు చేశాను.

Also Read : pushpa : నార్త్ అమెరికాలో పుష్పగాడి రూలింగ్ స్టార్ట్

ఈ రోజుల్లో సినిమా ఫంక్షన్ కు సెలెబ్రటీని తీసుకురావడం చాలా కష్టం. నేను ఏంతో మందిని బ్రతిమిలాడాను కానీ ఎవరు రాలేదు. ఒక సెలబ్రిటీ ను ప్రమోషన్స్ కి తీసుకురావడం చాలా కష్టం. ఈ లోపు సినిమా చేసేయొచ్చు. రాకేష్ అనే నేను ఒక బ్రాండ్ గా ఎదిగిన రోజున నేను కొత్త వాళ్ళతో సినిమా చేస్తాను. జితేందర్ రెడ్డి సినిమా నేను చేయడానికి కారణం ఈ సినిమా కథ. ఈ సినిమా పూర్తిగా చేసాం కానీ మే లో రిలీజ్ అనుకున్నాం. వేరే వేరే ఇష్యుస్ వల్ల సినిమా పోస్టుపోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడేం బాన్ చేస్తాం అంటున్నారు. కనీసం సినిమా చూసింది అందులో ఏం ఉందొ కూడా చూడకుండా అలా మాట్లాడుతున్నారు. జితేందర్ రెడ్డి గారు ఒక ఫైటర్. అయన అభిమానులు ఈ సినిమా చూస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమా కి 75 రూపీస్ తో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం” అని అయన అన్నారు.

Show comments