Site icon NTV Telugu

Mr India 2025: తెలంగాణ వాసికి మిస్టర్ ఇండియా 2025 టైటిల్.. సినీ ఎంట్రీ ఫిక్స్?

Mr India

Mr India

తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె మిస్టర్ ఇండియా 2025 టైటిల్‌ను సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన ఈ రాకేష్, గోవాలోని గోల్డెన్ క్రౌన్ రిసార్ట్స్‌లో జూన్ 19న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుని తాజాగా బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో త్వరలోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. రాకేష్ ఆర్నె మాట్లాడుతూ. సినిమా రంగంలో అడుగుపెట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యంపై శిక్షణ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు.

Also Read:Kannappa: ఏపీలో కన్నప్పకి టికెట్ రేట్ హైక్

2025లో జోష్ టాక్స్ తెలుగు, టెడ్‌ఎక్స్ తెలుగు వేదికలపై ప్రసంగించనున్నారు. అలాగే, “మిస్టర్ ఇండియా టాక్స్” అనే యూట్యూబ్ సిరీస్‌ను ప్రారంభించి యువతకు స్ఫూర్తినివ్వనున్నానని వెల్లడించాడు. రాకేష్, సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. తండ్రి యాదయ్య సమాజ సేవకుడిగా, తాత వెంకటయ్య స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు స్ఫూర్తినిచ్చారు. హైదరాబాద్‌లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో బీకామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్) పూర్తి చేసిన రాకేష్, 9 సంవత్సరాలుగా సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్నాడు.

Exit mobile version