Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ రజని ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ ముగించే పనిలో ఉన్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు క్రేజీ దర్శకులతో సరికొత్త ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతున్నారు సూపర్ స్టార్. తాజాగా రజనీ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌కు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమాకు డైరక్టర్స్ మారుతూ వస్తున్నారు. సుందర్ సి డైరెక్షన్ లో ప్రకటించిన ఈ సినిమాకు ఆ తర్వాత సీబీ చక్రవర్తి, నెల్సన్ దిలీప్ కుమార్ పేర్లు వినిపించాయి.
కానీ ఇప్పుఫు ఫైనల్ గా ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాల ఫేమ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఈ భారీ యాక్షన్ డ్రామాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే చెన్నై సమీపంలోని పూనమల్లిలో ఈ సినిమా కోసం భారీ సెట్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల చివరి నాటికే ఈ ల్యాండ్‌మార్క్ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా ఈ సినిమా కోసం రజనీకాంత్‌పై ఒక ప్రత్యేకమైన ఫోటోషూట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ డాక్టర్ లుక్ లో కనిపించనున్నట్టు సమాచారం. రజనీకాంత్ కెరీర్లో చాలా కాలం తర్వాత డాక్టర్ లుక్ లో దర్శనమివ్వబోతున్నాడు. ఈ ఫోటోషూట్ పిక్స్‌తో పాటు, సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ను మేకర్స్ త్వరలో విడుదల చేయనున్నారు.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
తాజావార్తలు
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ