సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీ.. లోకేష్ కాంబినేషన్ అంటేనే అభిమానులకు మాస్ గ్యారంటీ. అయితే, ఈసారి కూలీ కోసం టీం చేపట్టిన వినూత్న ప్రమోషనల్ ఐడియా నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read : Sattamum Neethiyum: OTT రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘సట్టముమ్ నీతియుమ్’
ఇటీవలి కాలంలో ప్రమోషన్లు అంటే ఇంటర్వ్యూలు, ట్రైలర్స్ వరకే పరిమితమవుతున్నప్పుడు, ‘కూలీ’ టీం కొత్తగా ఆలోచించింది. ఇప్పుడు అమెజాన్ డెలివరీ బాక్స్‌లపై కూలీ పోస్టర్స్ కనిపించడమే అందుకు నిదర్శనం. డెలివరీ డబ్బాలపై సినిమా పోస్టర్లు ఉండటం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ ‘ఇది దూకుడు ప్రమోషన్!’ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రియేటివ్ యాక్టివిటీ పై మేకర్స్ ఓ ప్రత్యేక వీడియో కూడా విడుదల చేశారు. ఈ యాక్టివిటీ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఇక ‘కూలీ’ మూవీ ఈ ఆగస్టు 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేసిన ఈ మూవీ, ప్రమోషన్ నుంచి రిలీజ్ వరకూ స్పెషల్‌గా ఉండబోతోంది.
